Supreme Court
Supreme Court| అకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న స్థానికత నిబంధనల ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది.
MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన విద్యార్థులను మాత్రమే లోకల్ అభ్యర్థులుగా పరిగణించే నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
నాలుగేళ్ల విద్యాభ్యాసం నిబంధన ఏకపక్షంగా ఉందన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నిర్దేశించిన స్థానికత ప్రమాణాలను అనుసరించాలని స్పష్టం చేసింది.
లోకల్ రిజర్వేషన్‌కు కీలకం
ఈ తీర్పుతో తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల్లో లోకల్ రిజర్వేషన్ పొందాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధన కీలకంగా మారింది. MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండటం స్థానిక అభ్యర్థిత్వానికి ముఖ్యమైన ప్రమాణంగా ఉండనుంది.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతను నిర్ణయించే నిబంధనలను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
