Chiranjeevi
Chiranjeevi| ఆకేరు న్యూస్, సినిమా: మెగాస్టార్ చిరంజీవి త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. కొంతకాలంగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న చిరంజీవి.. ఈ టాక్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం మెగాస్టార్‌కు భారీ రెమ్యూనరేషన్ అందనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చిరంజీవిని మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సమాచారం.
అయితే టాక్ షోకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫార్మాట్, రెమ్యూనరేషన్ తదితర అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
‘కాకా’తో బిజీ
మరోవైపు చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘కాకా’ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
విడుదలకు ‘విశ్వంభర’
వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను చిరంజీవి పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే మూవీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
