Golden Bhagyam
* గ్లింప్స్ అదిరిపోయేలా!
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ‘రంగబలి’ చిత్రంతో ఎంటర్టైనర్గా ఆకట్టుకున్న దర్శకుడు పవన్ బాసంశెట్టి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నాగార్జున రెడ్డి నిర్మాణంలో పవన్ బాసంశెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘గోల్డెన్ భాగ్యం’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
* భోజనంతో మొదలైన సరదా గొడవ..
గ్లింప్స్ ఓ సరదా సంభాషణతో మొదలవుతుంది. ఓ తెలుగు వ్యక్తి బిర్యానీ, కూల్‌డ్రింక్‌ను ఆస్వాదిస్తూ ఉంటే.. మరోవైపు ఓ తమిళ వ్యక్తి ఇడ్లీ, సాంబార్‌తో కనిపిస్తాడు.
తమ ఆహారమే గొప్పదంటూ ఇద్దరూ వాదించుకుంటుండగా.. మూడో వ్యక్తి జోక్యం చేసుకుని అసలు ఆసక్తికరమైన కాంబినేషన్‌ను పరిచయం చేస్తాడు. అదే సత్య–యోగిబాబు కాంబినేషన్.
* భాషలే కామెడీకి బలం..
సత్య, యోగిబాబు సంప్రదాయ తెల్లటి దుస్తుల్లో కనిపించగా.. ఈ సినిమా ప్రేమ, నేరం, యాక్షన్‌తో కూడిన కథ అని దర్శకుడు సరదాగా వివరిస్తాడు. అనంతరం ‘గోల్డెన్ భాగ్యం’ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో భాషలతో దర్శకుడు ఆసక్తికరమైన ప్రయోగం చేసినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
తెలుగు నటుడు సత్య తమిళంలో మాట్లాడటం, తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు పొందిన యోగిబాబు తెలుగులో మాట్లాడటం సినిమాకు ప్రధాన హాస్యాంశంగా నిలిచేలా కనిపిస్తోంది.
* ‘టెలుమిల్’ కామెడీ టానిక్..
తొలుత సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఆ తర్వాత విడుదలను పండుగ సీజన్ దాటి ఏడాదిలోనే ఉంటుందని పేర్కొన్నారు.
తెలుగు, తమిళ భాషల కలయికతో రూపొందుతున్న ఈ ‘టెలుమిల్’ కామెడీ టానిక్‌లో జయశ్రీ, అధిరాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. బబ్లూ అజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. పవన్ సీహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
