Chilpur
Chilpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీరాముడు, పరమశివుడిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం చేపట్టారు.
దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు నాయకులు ప్రయత్నించగా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ కాదుగాయ రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరటి రాజు, జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, బాల్నే శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ముక్కెర రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కందుకూరు రజినీకార్, మండల నాయకులు కన్నెబోయిన అశోక్, అనిల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
