Rayaparthy
* గుగులోత్ అరుణ్ నాయక్
Rayaparthy: ఆకేరు న్యూస్, రాయపర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంసీపీఐ(యు) మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ అరుణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అరుణ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర ప్రధాన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. వితంతువులు, వికలాంగుల పెన్షన్లను పెంచాలని, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ప్రభుత్వ స్థలాల్లో 60 గజాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అరుణ్ నాయక్ హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
