Dhurandhar 2
* టీవీ వెర్షన్లో 45–50 సన్నివేశాల తొలగింపు..
* 10 నిమిషాలు తగ్గిన నిడివి
ఆకేరు న్యూస్, సినిమా: రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. థియేట్రికల్ వెర్షన్‌కు ‘A’ సర్టిఫికెట్ లభించగా.. టీవీ ప్రసారానికి అనుగుణంగా చిత్రాన్ని మేకర్స్ మరోసారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు సమర్పించారు.
45–50 సన్నివేశాలకు కట్స్
బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. టీవీ వెర్షన్లో సుమారు 45–50 మార్పులు చేయాలని సీబీఎఫ్సీ సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా హింస, రక్తపాతానికి సంబంధించిన సన్నివేశాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కథపై పెద్దగా ప్రభావం పడకుండా ఆయా సన్నివేశాలను ఎడిట్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 24న టీవీ వెర్షన్‌కు U/A 16+ సర్టిఫికెట్ లభించింది.
10 నిమిషాలు తగ్గిన నిడివి
థియేట్రికల్ వెర్షన్ నిడివి 229.6 నిమిషాలు కాగా.. సెన్సార్ మార్పుల తర్వాత టీవీ వెర్షన్ 219 నిమిషాల 6 సెకన్లకు చేరింది. దీంతో సినిమా నిడివి దాదాపు 10 నిమిషాలు తగ్గింది.
అక్టోబర్ 18న ప్రీమియర్
‘ధురంధర్: ది రివెంజ్’ అక్టోబర్ 18న సాయంత్రం 7 గంటలకు స్టార్ గోల్డ్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
