Rajinikanth
* అభిమానులకు సర్ప్రైజ్
ఆకేరు న్యూస్, సినిమా: భారతీయ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్ తన సింప్లిసిటీతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఆయన.. మైసూరులోని షూటింగ్ లొకేషన్‌కు ఏకంగా ఆటో రిక్షాలో వచ్చారు. రజనీ ఆటోలో రావడం చూసిన అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అభిమానులకు చేతులూపుతూ..
మరూన్ రంగు చొక్కా, పంచె ధరించిన రజనీకాంత్ ఆటో నుంచి బయటకు వచ్చి అక్కడున్న అభిమానులకు చేతులూపారు. అనంతరం షూటింగ్ కోసం లోపలికి వెళ్లారు. రజనీకాంత్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది వారిని నియంత్రిస్తూ షూటింగ్ ప్రాంతంలోకి రాకుండా గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అభిమానుల సందడి కొనసాగడంతో రజనీకాంత్ మరోసారి బయటకు వచ్చి వారిని పలకరించారు.
‘బాబా’ స్టైల్లో పిల్లలు
ఈ సందర్భంగా చిన్నారులు కూడా రజనీకాంత్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూశారు. కొందరు ఆయన నటించిన ‘బాబా’ (2002) సినిమాలోని ప్రత్యేక హావభావాలను అనుకరించడం కనిపించింది. షూటింగ్ స్పాట్‌కు ఆటోలో వచ్చిన రజనీకాంత్.. అభిమానులను పలకరించిన తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
