JFC Resurvey
JFC Resurvey| ఆకేరు న్యూస్, తొర్రూరు: భూముల రీసర్వేతో సరిహద్దు వివాదాలు, కొలతల్లో తేడాలు, రికార్డుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మహబూబాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం తొర్రూరు మండలం కొమ్మనపల్లి గ్రామంలో రీసర్వే ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జేసీ.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రచ్చబండ వద్ద రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ కెమెరాలు, జీపీఎస్ రోవర్ పరికరాలతో ప్రతి గుంట భూమిని కచ్చితంగా సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు తమ భూమికి సంబంధించిన పత్రాలు, పహాణీలు సిద్ధంగా ఉంచుకుని సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. భూమి విస్తీర్ణం, సరిహద్దు వివాదాలు, సర్వే నంబర్లలో తప్పులపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. రీసర్వేలో ఏ రైతుకూ అన్యాయం జరగకుండా రికార్డులను పక్కాగా సరిచేస్తామని జేసీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ జి. శ్రీనివాస్, సర్వేయర్ గురువేశ్, జీపీఓ లలిత, లైసెన్స్డ్ సర్వేయర్లు వెంకన్న, బచ్చన్న, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
