AITUC
AITUC| ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు కందుకూరి సోమయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ హమాలి యూనియన్ మండల అధ్యక్షుడు గిద్దే వెంకటయ్య, సీపీఐ ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోట్ల శ్రీనివాస్ కలిసి సోమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సోమయ్య కుమారుడు, హమాలి కార్మికుడు కందుకూరి యాకయ్యతో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కార్మిక కుటుంబాలకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని గిద్దే వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హమాలి యూనియన్ నాయకులు, కార్మికులు, గ్రామస్తులు పాల్గొని సోమయ్యకు నివాళులర్పించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
