Hussain Sagar
Hussain Sagar| ఆకేరు న్యూస్, హైదరాబాద్: గణేష్ నిమజ్జనాలు ముగియడంతో హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) వ్యర్థాల తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సుమారు 15 రోజులుగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 12 వేల మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, బతుకమ్మ ఘాట్, లేక్‌ఫ్రంట్ పార్కు సమీపంలోని బేబీ పాండ్ ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగినప్పటి నుంచే వ్యర్థాల తొలగింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
20 ట్రిప్పర్లతో తరలింపు
వ్యర్థాల తొలగింపు కోసం 20 ట్రిప్పర్లు, 18 ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ట్యాంక్‌బండ్ వైపు వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తే బండ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాన్ని మినహాయించి మిగతా ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగిస్తున్నారు.
తొలగించిన వ్యర్థాలను ట్రిప్పర్ల ద్వారా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మరో రెండు రోజుల్లో 2 వేల మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించి మొత్తం ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
