Captain Smith Machar
* ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడిన స్మిత్
* నిజమైన హీరో అని ప్రముఖుల ప్రశంసలు
* ప్రాణాలతో పోరాడుతున్న పైలట్
ఆకేరు న్యూస్, డెస్క్ : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగానే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ జాతీయత కలిగిన కో-పైలట్, కాక్‌పిట్‌లో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో కెప్టెన్ స్మిత్ తల, చేతులకు తీవ్ర లోతైన గాయాలయ్యాయి. కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా.. కత్తి తన శరీరాన్ని తూట్లు పొడుస్తున్నాకెప్టెన్ స్మిత్ మచ్చార్ ఎదురొడ్డి పోరాడారు. విమానంలో ఉన్న ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా కోపైలట్ ను ఎదిరించి, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో స్మిత్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
తీవ్ర గాయాలైనా వెన్నుచూపని ధైర్యం
ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైనా, శరీరం నుంచి రక్తం కారుతున్నా కెప్టెన్ స్మిత్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపులను తెరవడంతో, విమానంలో ప్రయాణిస్తున్న ఇతర పైలట్లు, ప్రయాణికులు లోపలికి వచ్చి దాడి చేస్తున్న కో-పైలట్‌ను నిలువరించారు. అనంతరం స్మిత్ విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
స్మిత్ ఆరోగ్యం నిలకడ
అత్యవసర ల్యాండింగ్ తర్వాత తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కెప్టెన్ స్మిత్‌కు వైద్య బృందం, దంత వైద్యుడు డాక్టర్ షోటా మొసావ్లు తక్షణ అత్యవసర వైద్యం అందించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.
ఆయన నిజమైన హీరో
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో 174 మంది ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహులు ప్రశంసించారు. “స్మిత్ అచంచలమైన ధైర్యం దేశానికే గర్వకారణం, ఆయన నిజమైన హీరో” అని ప్రధాని మోదీ కొనియాడారు. కెప్టెన్ స్మిత్ త్వరితగతిన పూర్తిగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. స్మిత్ కుటుంబంతో తాను మాట్లాడి ధైర్యం చెప్పినట్లు మోదీ తెలిపారు.
దేశం సెల్యూట్
విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఫ్లైదుబాయ్ భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కెప్టెన్ స్మిత్ ధైర్యానికి దేశమంతా సెల్యూట్ చేస్తోందని కొనియాడారు. ఆయన నిజమైన హీరో అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
