Kajal Aggarwal
Kajal Aggarwal| ఆకేరు న్యూస్, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగు ఆడియోతోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కెమికల్స్ మాఫియా కథాంశంతో..
కెమికల్స్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాను దర్శకుడు చేతన్ డీకే తెరకెక్కించారు. థ్రిల్లర్ అంశాలతో పాటు క్రైమ్ నేపథ్యంలో సాగే కథలో కాజల్ కీలక పాత్రలో కనిపించారు.
హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్
ఈ చిత్రాన్ని జియో హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కాజల్ అభిమానులు ఇకపై ఈ సినిమాను తెలుగులోనూ వీక్షించవచ్చు. కాజల్‌తో పాటు శ్రేయస్ తల్పడే, మురళీ శర్మ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. సాగర్ బి. షిండే ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీపై దృష్టి పెడుతున్న కాజల్‌కు ఈ సినిమా మరో విభిన్న ప్రయత్నంగా నిలిచింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
