Amitabh Bachchan
Amitabh Bachchan| ఆకేరు న్యూస్, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి 18 షూటింగ్లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే తాజా ఎపిసోడ్లో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎడమ మోకాలికి గాయం కావడంతో కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో కొంత ఇబ్బంది ఎదురైనట్లు చెప్పారు.
జారిపడటంతో..
షూటింగ్ సందర్భంగా జారిపడటంతో మోకాలికి గాయమైనట్లు అమితాబ్ వివరించారు. సాధారణంగా కేబీసీ వేదికపై నిల్చొని తన మోనోలాగ్‌తో షోను ప్రారంభించే ఆయన.. ఈసారి కూర్చునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎక్కువసేపు నిలబడటం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే తనకు తగిలిన గాయం పెద్దది కాదని అమితాబ్ స్పష్టం చేశారు. కంటెస్టెంట్లను పరిచయం చేసే సమయంలో మాత్రం నిల్చొని ఉండనున్నట్లు చెప్పారు. అమితాబ్ గాయపడిన విషయం తెలియడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అభిషేక్‌తో బంధంపై..
మరోవైపు అమితాబ్ బచ్చన్ ఇటీవల తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో ఉన్న అనుబంధంపై చేసిన వ్యాఖ్యలు కూడా వార్తల్లో నిలిచాయి. ఇద్దరి అభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో భిన్నంగా ఉన్నప్పటికీ.. తమ మధ్య ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
