Telangana Cabinet
Telangana Cabinet| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిణామాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలోని 235 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు మంత్రివర్గానికి వివరించారు.
సబ్‌కమిటీకి బాధ్యత
కరువు పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ద్వారా సమగ్రంగా సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయం, నీటి లభ్యత తదితర రంగాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసి, అవసరమైన ఉపశమన చర్యలపై నిపుణులు, వివిధ వర్గాల నుంచి సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది.
కేంద్రానికి విజ్ఞప్తి
కరువు మండలాలను ప్రకటించడంతో పాటు రాష్ట్రానికి అవసరమైన సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
అఖిలపక్ష భేటీ
ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
