Warangal Traffic Police
Warangal Traffic Police| ఆకేరు న్యూస్, వరంగల్: వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లపై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధిక శబ్దం చేస్తున్నట్లు గుర్తించిన సుమారు 350 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.
తనిఖీల్లో సైలెన్సర్ల గుర్తింపు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర రావు ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ మైదాన్ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. వాహన తనిఖీల సమయంలో కంపెనీ నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా మార్పులు చేసిన సైలెన్సర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అధిక శబ్దంతో ఇబ్బందులు
మాడిఫైడ్ సైలెన్సర్ల కారణంగా వాహనాల నుంచి పెద్ద శబ్దం వెలువడటంతో శబ్ద కాలుష్యం పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ తరహా శబ్దాల వల్ల విద్యార్థులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి అసౌకర్యం కలగవచ్చని పేర్కొన్నారు.
ఒరిజినల్ సైలెన్సర్లే వాడాలి
వాహనదారులు కంపెనీ అమర్చిన ఒరిజినల్ సైలెన్సర్లనే వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లలో మార్పులు చేసి అధిక శబ్దం వచ్చేలా వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సుజాత తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
