Mahatma Gandhi Jayanti
GWMC కార్యాలయంలో జయంతి వేడుకలు
అకేరు న్యూస్, వరంగల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. కార్యాలయ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను అధికారులు స్మరించుకున్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను అనుసరించి దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన అందించిన అపూర్వమైన సేవలను కొనియాడారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, CHO లక్ష్మారెడ్డి, MHO డాక్టర్ రాజేష్, ఉప కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హార్టికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంజయ్ కుమార్, రవికుమార్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీసీబీ చైర్మన్ ఇనుగాల వెంకట్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ అహింస, సత్యం, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను పాటించాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి తరానికి కూడా ఆదర్శప్రాయమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పరకాల పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని అమరవీరుల మైదానం (స్మారక భవనం) చాపలబండ వద్ద నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ దేశానికి చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ పోషించిన పాత్రను, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా, వాటిని నిత్య జీవితంలో ఆచరించాలని ఎమ్మెల్యే సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
మహాత్మా గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
