GO 317 Employees
GO 317 బాధితుల ముట్టడికి పిలుపు
అకేరు న్యూస్, హైదరాబాద్ :హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. GO 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గాంధీ భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని GO 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా GO 190ను అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
GO 317 కారణంగా తమకు జరిగిన బదిలీల్లో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కొత్తగా బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా బాధితుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, వారి ఇష్టానుసారం స్వగ్రామ జిల్లా లేదా సంబంధిత జోన్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ కుటుంబ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బదిలీల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
