Rayaparthy
Rayaparthy| ఆకేరు న్యూస్, రాయపర్తి: హనుమకొండలోని మాక్స్ కేర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ కుందూరు వెంకట్ రెడ్డి అకాల మరణం పట్ల రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యా నాయక్తో పాటు పలువురు నాయకులు కాట్రపల్లిలోని ఆయన స్వగ్రామానికి వెళ్లారు.
అక్కడ డాక్టర్ కుందూరు వెంకట్ రెడ్డి భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వైద్య రంగంలో డాక్టర్ వెంకట్ రెడ్డి అందించిన సేవలను, ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
