Gandhi Jayanti
Gandhi Jayanti| ఆకేరు న్యూస్, తొర్రూర్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తొర్రూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతుకూరి రవీంద్రాచారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని గాంధీ విగ్రహానికి, పార్టీ కార్యాలయంలోని గాంధీ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. సత్యం, అహింస మార్గాల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని అన్నారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యం, పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మోతుకూరి రవీంద్రాచారి మాట్లాడుతూ.. గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త ఆచరించాలని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా గాంధీజీకి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
