P Vijaya Reddy
P Vijaya Reddy| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కుమార్తె పి. విజయారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దానం నాగేందర్ ఎన్నికను కోర్టు రద్దు చేస్తే, రన్నరప్‌గా ఉన్న తనను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
హైకోర్టులో కొనసాగుతున్న పిటిషన్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన విజయారెడ్డి.. దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులకు సంబంధించిన వివరాలను నిబంధనలకు అనుగుణంగా వెల్లడించలేదని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసులో తన వాదనలకు న్యాయపరమైన ఆధారాలు ఉన్నాయని విజయారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఉప ఎన్నికపై ఉత్కంఠ
దానం నాగేందర్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. దీంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికపై చర్చ మొదలైంది.
అయితే తన ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నాయని విజయారెడ్డి పేర్కొన్నారు. ముందుగా తన పిటిషన్‌పై నిర్ణయం రావాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ నిర్ణయంపై ఆసక్తి
ఒకవేళ ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైతే కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్‌పై వచ్చే తీర్పు తదుపరి రాజకీయ పరిణామాలకు కీలకంగా మారనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
