Vikarabad Bus Accident,
* లోయలోకి దూసుకెళ్లిన బస్సు
ఆకేరు న్యూస్, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే వివరాలు, వారి పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
