Rahul Gandhi Satyagraha
* ‘సత్యాగ్రహ’ ప్రారంభించిన రాహుల్ గాంధీ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ప్రజా సమస్యలు, అన్యాయాలపై ప్రజల గొంతును వినిపించేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘సత్యాగ్రహ’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. శాంతియుత ప్రతిఘటన, అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ‘సత్యాగ్రహ’ ఉద్దేశమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ప్రజల హక్కులకు సంబంధించిన అంశాలను గుర్తించి, వాటి తీవ్రత, ప్రాధాన్యత ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ డిజిటల్ వేదికలో భూమి హక్కులు, మహిళల సమస్యలు, దళితులు, ఓబీసీల హక్కులకు సంబంధించిన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే విద్యా రంగం, పరీక్షలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వేదిక ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలను తెలియజేయడంతో పాటు అన్యాయం లేదా హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను డిజిటల్ వేదిక ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావచ్చని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. సమస్యల తీవ్రతను పరిశీలించి వాటిపై అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
గాంధీజీ చూపిన సత్యాగ్రహ మార్గంలో శాంతియుతంగా ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లడం, అధికార వ్యవస్థను ప్రశ్నించడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశమని రాహుల్ గాంధీ వివరించారు. ప్రజల నుంచి వచ్చే అంశాలను సమీకరించి, వాటిని సంబంధిత స్థాయిలో ప్రస్తావించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
