Station Ghanpur
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో కీలకమని ఏసీడీపీవో శోభారాణి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండలంలోని తాటికొండ అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం పోషణ్ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అంగన్వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మి, సులోచన, లలిత, అరుణాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం పోషణ్ మాసం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీడీపీవో శోభారాణి మాట్లాడుతూ.. పోషకాహారం ఆరోగ్యకరమైన కుటుంబానికి పునాది వంటిదని అన్నారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
సర్పంచ్ మారపాక సుజనా శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మి, సులోచన, లలిత, అరుణాదేవి, ఏఎన్ఎం నాగరాణి, ఆశా కార్యకర్తలు మాధవి, సబీనా, రజిత, జ్యోతి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
