Kamalapur
Kamalapur| ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ గుండె బాబు ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పనులకు సంబంధించి 17వ విడత సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.2.97 కోట్ల విలువైన పనులను తనిఖీల పరిధిలోకి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
13వ తేదీ వరకు తనిఖీలు
రేపటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీల ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఎస్ఆర్పీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం గ్రామాల్లో పర్యటించి ఉపాధి హామీ పనుల వివరాలను పరిశీలించనుంది.
పనుల అమలు, ఖర్చులు, రికార్డులు తదితర అంశాలను పరిశీలించి సామాజిక తనిఖీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
