* ఆపరేషన్ ఫైర్ వాల్
* పాక్ గూఢచర్యం భగ్నం
Operation Firewall 2026: ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ లో గూఢచర్యం కలకలం రేపుతోంది. ఆపరేషన్ ఫైర్ వాల్ తో భారీ కుట్ర బయటపడింది. పాకిస్తాన్ కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సంచలన ఆపరేషన్ ఫైర్ వాల్ – 2026 ద్వారా కుట్రను ఛేదించారు. 13 మంది నావికాదళం సిబ్బంది సహా 18 మంది వ్యక్తులపై నిఘా పెట్టారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు జరిపారు. ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో నేవీ సిబ్బంది రహస్య సంబంధాలు బహిర్గతం అయ్యాయి.
విశాఖ కేంద్రంగా..
విశాఖ కేంద్రంగా గూఢచర్య వలయం కొనసాగినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. 12 ప్రత్యేక బృందాలతో మెరుపు దాడి చేసిన ఏపీ సీఐ సెల్ గూఢచర్య కుట్రను ఛేదించింది. రాకెట్ గుట్టును రట్టు చేయడంలో ఏపీ పోలీసులు విజయవంతమయ్యారు. కదలికలను ఎన్ స్క్రిప్టెడ్ సాఫ్ట్ వేర్ ద్వారా శత్రు దేశానికి వార్తలు చేరవేస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రైమ్ నంబర్ 01/2026 కింద బీఎన్ ఎస్ సెక్షన్లు 61(2), 147, 148 రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967లోని సెక్షన్లు 17, 18 కింద కూడా కేసు నమోదు చేశారు. అధికారిక రహస్యాల చట్టం 1923 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
