Palakurthi
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: అనుకోని ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేది బీమా అని పాలకుర్తి సీఐ భరత్ సుమన్ అన్నారు. ప్రతి కుటుంబం తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీమా తీసుకోవాలని సూచించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన పొర్ల మల్లయ్య ఇటీవల విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. దీంతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మంజూరు చేసిన రూ.6,72,000 బీమా పరిహారం చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పాలకుర్తి సీఐ భరత్ సుమన్ చేతుల మీదుగా ఈ చెక్కును అందించారు.
ఈ సందర్భంగా సీఐ భరత్ సుమన్ మాట్లాడుతూ.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా దూరమైతే ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీమా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాను అందిస్తుందని పేర్కొన్నారు.
అనవసర ఖర్చులను తగ్గించుకుని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీమా ప్రీమియం చెల్లించడం మంచిదని సూచించారు. మల్లయ్య మరణం కుటుంబానికి తీరని లోటని, అయితే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ త్వరితగతిన స్పందించి పరిహారం అందించడం అభినందనీయమని తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్ బ్రాంచ్ మేనేజర్ వినయ్ గౌడ్, శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గజ్జి రాజు, ముత్తారం గ్రామ సర్పంచ్ చింతకింది అనితతో పాటు పలువురు స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
