* అధికారులను ప్రశ్నించిన కౌన్సిలర్లు
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశం వాడీవేడిగా సాగింది. పలు అంశాలపై కౌన్సిలర్లు కమిషనర్, మున్సిపల్ అధికారులను ప్రశ్నించడంతో కొంతసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
పండుగ ఏర్పాట్లపై చర్చ
వినాయక చవితి, బతుకమ్మ, బోనాల పండుగలకు చేపట్టిన ఏర్పాట్ల మాదిరిగానే దసరా పండుగకు కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరారు.
పలు అంశాలపై నిలదీత
పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, జేసీబీ వినియోగం, సిబ్బంది కొరత, అభివృద్ధి పనులు, నిధుల వినియోగం తదితర అంశాలపై కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు. ఆయా అంశాలపై చైర్మన్, కమిషనర్ సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ, కమిషనర్ రాధాకృష్ణతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
