Warangal Collector
* పాఠశాలలో విద్యార్థులపై దాడి
* సోషల్ మీడియా వీడియోపై కలెక్టర్ సీరియస్
ఆకేరు న్యూస్, వరంగల్ : పాఠశాలలో విద్యార్థులకు బాసటగా నిలవాల్సిన ఉపాధ్యాయురాలే బెత్తంతో విరుచుకుపడటం తీవ్ర కలకలం రేపింది. 5వ తరగతి చదువుతున్న చిన్నారులపై బెత్తంతో దాడి చేసిన ఘటనలో సదరు ఇంగ్లీష్ టీచర్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని “తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు)”లో ఇంగ్లీష్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రజిని, 5వ తరగతి విద్యార్థినులను బెత్తంతో విచక్షణారహితంగా కొట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి.
* సుమోటోగా స్పందించిన కలెక్టర్
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సత్యశారద తక్షణమే సుమోటోగా స్పందించారు. ఘటన తీవ్రతను గుర్తించిన కలెక్టర్, ప్రాథమిక విచారణ జరపాల్సిందిగా ఎంపీడీవో (MPDO)ను ఆదేశించారు. ఎంపీడీవో సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగా ఉపాధ్యాయురాలు రజినిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులపై ఎలాంటి వేధింపులు లేదా శారీరక దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
విద్యార్థుల భద్రతకు, మానసిక స్వేచ్ఛకు తమ ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
