Yashaswini Reddy MLA
* హంగూ ఆర్భాటాలకు స్వస్తి..
* ప్రోటోకాల్ పక్కనపెట్టి కార్యకర్తలతో మమేకం
ఆకేరు న్యూస్, రాయపర్తి : పాలనంటే కేవలం గదికే పరిమితం కాదని, ప్రజల, కార్యకర్తల గుండెల్లో ఉండటమే అసలైన ప్రజాస్వామ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, మరోసారి నిరూపించారు.
ప్రజాప్రతినిధిగా ఎంతటి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ, సామాన్యులతో మమేకమయ్యే తన సహజ సిద్ధమైన శైలితో నియోజకవర్గ ప్రజల మనసులను ఆమె గెలుచుకుంటున్నారు.
బుధవారం వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పలు అధికారిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో.. మార్గమధ్యలో రాయపర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాసేపు ఆగారు.
ఎలాంటి పూర్వ సమాచారం, ఆర్భాటాలు లేకుండా సడన్గా వచ్చిన ఎమ్మెల్యేను చూసి స్థానికులు, పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కార్యకర్తే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక..
ఈ పర్యటనలో భాగంగా రాయపర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్త కృష్ణ నిర్వహిస్తున్న స్థానిక టీ షాప్ను ఎమ్మెల్యే సందర్శించారు.
పార్టీకి వెన్నుముకలా నిలిచే కార్యకర్తలను గౌరవించడమే తన ప్రథమ కర్తవ్యమని చాటుతూ.. అక్కడ ఉన్న బెంచీలపై ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సాధారణంగా కూర్చున్నారు. స్వయంగా చాయ్ తాగుతూ అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు.
ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ..
ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా రాయపర్తి మండల పరిధిలోని గ్రామాల ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, స్థానిక రాజకీయ పరిస్థితులు మరియు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటంపై క్షేత్రస్థాయి నాయకులతో విస్తృతంగా చర్చించారు.
నాయకులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు.
ఎమ్మెల్యే నిరాడంబరతపై ప్రశంసల జల్లు..
ఎలాంటి భేషజాలు లేకుండా, అధికారాన్ని నెత్తిన వేసుకోకుండా తమ ఇంటి ఆడపడుచులా సాధారణ కార్యకర్త టీ షాప్లో కూర్చొని ఆత్మీయంగా మాట్లాడటంపై కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి ఈ నిరాడంబర శైలి నియోజకవర్గ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని, దిశానిర్దేశాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, గ్రామ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
