Telangana DA Hike
* ఒకేసారి 2 డీఏలు పెంపు..
* నవంబర్ 1న పెరిగిన జీతం!
Telangana DA Hike| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు విడతల కరువు భత్యం (DA) పెంపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* జనవరి, జూలై 2024 డీఏలు పెంపు
జనవరి 2024, జూలై 2024 విడతలకు సంబంధించిన డీఏలను ప్రభుత్వం ఒకేసారి పెంచింది. సాధారణ ఉద్యోగులకు జనవరి 2024 నుంచి డీఏ 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెరగనుంది. జూలై 2024 నుంచి డీఏ 40.04 శాతానికి చేరుతుంది. 2020 పే స్కేల్ ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. 2015 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 73.344 శాతం నుంచి 81.728 శాతానికి పెరుగుతుంది.
* ఇతర పే స్కేళ్లకు కూడా వర్తింపు
2016 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 53 శాతానికి, 2006 పే స్కేల్ ఉద్యోగులకు 246 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE) పే స్కేళ్ల ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయి.
* నవంబర్ 1న పెరిగిన జీతం
పెంచిన డీఏను అక్టోబర్ 2026 జీతంతో కలిపి నవంబర్ 1న నగదు రూపంలో చెల్లించనున్నారు. అంటే అక్టోబర్ నెల జీతంలో పెరిగిన డీఏ ఉద్యోగులకు అందనుంది.
* బకాయిలు జీపీఎఫ్‌లో జమ
జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న మొదటి డీఏ బకాయిలను 33 వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న రెండో డీఏ బకాయిలను 27 వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం తొలి డీఏ బకాయిలను 33 వాయిదాల్లో, రెండో డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
