Station Ghanpur| స్టేషన్ ఘన్పూర్: దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో రావణాసుర దహన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న దసరా వేడుకలను ప్రజల సహకారంతో వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు, ప్రజలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
14వ వార్డులోని క్రీడా ప్రాంగణంలో కౌన్సిలర్ కృష్ణవేణి సారయ్య ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ గట్టయ్య, ఎస్సై రాజేష్, కో-ఆప్షన్ సభ్యులు బూర్ల లతా శంకర్, కౌన్సిలర్లు గట్టు సంగీత రమేష్, పోశాల కృష్ణ, పున్నం స్వరూప రాజయ్య, గుర్రం హైమావతి, బోనగిరి విద్యాసాగర్, దిండి సత్యం, గోపాల్, దిలీప్, రామాచారి, గడ్డాల శేఖర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
