Palakurthi
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) పాలకుర్తి మండల అధ్యక్షుడిగా చెన్నూర్ గ్రామానికి చెందిన తండా వినయ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
గతంలో బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించిన వినయ్ కుమార్ గౌడ్ సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం.. ఆయనకు మండల అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా వినయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ పాలకుర్తి మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
నాయకులకు కృతజ్ఞతలు
తన నియామకానికి సహకరించిన బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు హరీష్, రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు దొంగరి మహేందర్, పాలకుర్తి మండల అధ్యక్షుడు మారం రవికుమార్, మాజీ మండల అధ్యక్షుడు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు వేల్పుల దేవరాజ్, పెనుగొండ సోమేశ్వర్లకు తండా వినయ్ కుమార్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

