సినీ నటుడు నాగచైతన్య శోభిత ల ఎంగేజ్ మెంట్
* నాగార్జున ఇంట్లో.. సన్నిహితుల సమక్షంలో..
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఉదయం నాగార్జున ఇంట్లో సన్నిహితుల సమక్షంలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ అయింది. దీంతో ఇప్పుడు ఇదే టాలీవుడ్లో టాప్ న్యూస్ అయింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మద్య రిలేషన్ షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు విదేశాల్లో వీళ్లు కలిసి తిరిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను శోభిత ఖండించింది. మా మధ్య అలాంటిదేం లేదని చెప్పారు. అయితే తాజాగా నాగచైతన్య, శోభిత నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను నాగార్జునే షేర్ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలోనే ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు ప్రకటించారు. గతంలో నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో విడిపోతున్నట్లు వారు ప్రకటించారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
