మైనా
Myna| ఆకేరు న్యూస్, సినిమా: వైవిధ్యమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మైనా సినిమా సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాత సాయి రాజేష్‌కు చెందిన నూతన నిర్మాణ సంస్థ మిట్టి అండ్ మూన్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సాయి రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఘనంగా ప్రారంభం
హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో మైనా సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సినిమా ప్రకటన సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. తమ ప్రేమకు ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న రెండు ప్రేమ జంటలను పోస్టర్లో చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారీ తారాగణం
ఈ చిత్రంలో శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటి బాబు, దివ్య జయరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహి ఇప్పలపెల్లి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. చంటి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
త్వరలో షూటింగ్
ప్రేమకథలను తెరకెక్కించడంలో, నిర్మించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న సాయి రాజేష్ నిర్మాణంలో ‘మైనా’ మరో ఆసక్తికరమైన లవ్‌స్టోరీగా రూపొందనుంది. రెండు ప్రేమ జంటల ప్రయాణం, వాటికి ఎదురయ్యే సవాళ్లు కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

