H-1B Visa JD Vance India Remarks India US Relations
* భారతీయులపై వ్యాఖ్యలతో రగడ
* జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతీయ నిపుణుల సేవలను ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవని, అభ్యంతరకరంగా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది.
అమెరికా ఆర్థిక వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత పెరుగుదల, ఉద్యోగ కల్పనలో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది.
* విదేశీ నిపుణులపై జేడీ వాన్స్ వ్యాఖ్యలు..
మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు అమెరికన్లకు బదులుగా విదేశీ కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకోవడానికి శాశ్వత కార్మిక ధ్రువీకరణ ప్రక్రియ (పీఈఆర్ఎం)ను దుర్వినియోగం చేస్తున్నాయని జేడీ వాన్స్ ఆరోపించినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ, భారతీయ ఉన్నత విద్యావంతులు, నిపుణుల సేవలను తక్కువ చేసి చూపేలా మాట్లాడటం సరికాదని పేర్కొంది.
ప్రతిభావంతుల పరస్పర మార్పిడి వల్ల భారత్, అమెరికా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. వలస పాలన కాలం నాటి భావనలను గుర్తుచేసేలా వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడింది.
* 8 ఐటీ సంస్థలపై ప్రభావం
మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ సహా ఎనిమిది ప్రముఖ ఐటీ సంస్థలకు సంబంధించిన గ్రీన్‌కార్డ్ నియామక ప్రక్రియపై అమెరికా తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు సమాచారం. ఈ పరిణామం విదేశీ నిపుణుల శాశ్వత నివాస ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
* హెచ్-1బీ వీసాదారులకు ఊరట
పీఈఆర్ఎం, హెచ్-1బీ వీసా కార్యక్రమాలు వేర్వేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గ్రీన్‌కార్డ్ స్పాన్సర్షిప్ కోసం అవసరమైన కార్మిక ధ్రువీకరణ ప్రక్రియలో జాప్యం జరిగితే అర్హులైన ఉద్యోగుల శాశ్వత నివాస అనుమతి పొందే ప్రక్రియ ఆలస్యం కావచ్చని వెల్లడించింది.
అయితే పీఈఆర్ఎం ప్రక్రియపై సస్పెన్షన్ విధించడం వల్ల ప్రస్తుతం అమెరికాలో చెల్లుబాటు అయ్యే హెచ్-1బీ వీసాలపై నేరుగా ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. దీంతో ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న భారతీయ ఉద్యోగులకు కొంత ఊరట లభించినట్లయింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

