KCR Family Assets TPCC leader Dr Perumandla Ramakrishna
*సీబీఐ విచారణకు డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్), తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ కవిత మరియు జోగినపల్లి సంతోష్ రావుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)చే సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధినేత, ఆయన కుటుంబ సభ్యులు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో సంపాదించిన ఆస్తులు, వాటికి సంబంధించిన మూలాలు, నిధుల మళ్లింపు మరియు మనీలాండరింగ్ వ్యవహారాలపై పారదర్శకమైన, పూర్తిస్థాయి దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇటీవల తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిర్గతం చేసిన ఆస్తుల వివరాలతో పాటు, సదరు కుటుంబ సభ్యులు, వారి అనుచరుల పేరు మీద ఉన్న ఆస్తులన్నింటిపై లోతైన విచారణ జరిపి నిష్పక్షపాతంగా నిజానిజాలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
గతంలో పాస్పోర్టు ఏజెంట్గా సాధారణ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తులు, రాజకీయాధికారాన్ని అడ్డుపెట్టుకుని అతి స్వల్ప కాలంలోనే వేల కోట్ల రూపాయల మేర ఆస్తులను ఎలా సమకూర్చుకోగలిగారో దర్యాప్తు సంస్థలు తేల్చాలని పేర్కొన్నారు.
“రాజకీయం అంటే ప్రజాసేవ అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, ఎస్సీ, ఎస్టీ, బహుజన ఉద్యమకారుల ఆత్మత్యాగాలు, శవాల పునాదులపై అధికారాన్ని చేపట్టి అక్రమంగా సంపదను కూడబెట్టారు” అని డాక్టర్ రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమ సంపాదనకు సంబంధించిన నిధుల మూలాలు ఎక్కడున్నాయో తేల్చడానికి సీబీఐ విచారణ ఒక్కటే సరైన మార్గమని ఆయన తేల్చిచెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

