Seethakka
* కరువుపై అవగాహన కల్పించాలి
* మంత్రి సీతక్క
Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తృతంగా చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. మారుమూల గ్రామాల ప్రజలకు అండగా నిలుస్తూ, వివిధ అంశాలపై అవగాహన కల్పించే సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
గురువారం ములుగు జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలక మండలి సభ్యులు మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులను ఆమె అభినందించారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు.
కరువుపై అవగాహన కల్పించాలి
ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలను సన్నద్ధం చేయడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. విద్యుత్తు, సాగునీరు, తాగునీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కరువు పరిస్థితులను తట్టుకునేందుకు రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
రెడ్ క్రాస్ భవనానికి నిధులు
ములుగు జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ అధికారి లింగారెడ్డిని ఆదేశించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అలెం అప్పయ్య, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి కొట్టే రాజిరెడ్డి, కోశాధికారి శిరుప సతీష్ కుమార్, జిల్లా పాలక మండలి సభ్యులు గూడూరు మహిపాల్, కోగిల సారయ్య, రవితేజ, రామిడి కృష్ణారెడ్డి, ముక్కు సుబ్బారెడ్డి, చుంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

