Mulugu DSP Ravinder
* ములుగు డీఎస్పీ రవీందర్
Mulugu DSP Ravinder| ఆకేరు న్యూస్, ములుగు: పంట పొలాల్లో అటవీ జంతువుల కోసం విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు డీఎస్పీ రవీందర్ హెచ్చరించారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అటవీ జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు కొందరు రైతులు పొలాల్లో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారని, వీటి కారణంగా మనుషుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచ్చుల వల్ల కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతాయని పేర్కొన్నారు.
ఉచ్చులు పెడితే జైలు
ఇటీవల ములుగు మండలంలోని జాకారం గ్రామ పంచాయతీ పరిధిలో పంట పొలాల్లో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ ఉచ్చులకు బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సూచించారు.
సమాచారం ఇవ్వండి
పంట పొలాల్లో ఎక్కడైనా విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు తెలిసినా, కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు డీఎస్పీ రవీందర్ విజ్ఞప్తి చేశారు. అటవీ జంతువుల సంరక్షణతో పాటు మనుషుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

