సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ రాజమహేంద్ర నాయక్
* పోలీస్ అమరవీరుల త్యాగాలను మరువద్దు
* డీసీపీ రాజమహేంద్ర నాయక్
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల సేవలను ప్రజలు ఎప్పటికీ మరువకూడదని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మా గార్డెన్స్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. జనగామ ప్రభుత్వ రక్తనిధి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 117 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, రఘునాథపల్లి, లింగాల ఘన్పూర్ మండలాలకు చెందిన యువత స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రక్తదానం చేసిన యువతకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ రక్తనిధి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతో పాటు పండ్లను అందజేసి అభినందించారు.
రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. రక్తదానం అత్యంత గొప్ప సేవ అని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకరి రక్తదానం పలువురి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో రక్తం అందక ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత చేసే రక్తదానం బాధితులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ భీం శర్మ, స్టేషన్ ఘన్పూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రఘునాథపల్లి సీఐ వేణు, మున్సిపల్ చైర్పర్సన్ వినయ్, ఎస్ఐలు రాజేష్, అరుణ్, శ్రవణ్, భరత్, వైద్యులు దివ్య, అజయ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

