ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
* ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపు
Muthireddy Yadagiri Reddy| ఆకేరు న్యూస్, ములుగు: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ములుగు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని సూచించారు.
ఈ మేరకు గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బడే నాగజ్యోతి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటరు నమోదు ప్రక్రియ కీలకమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులన్నీ బాధ్యతగా పనిచేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు నమోదుపై సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాకులమారి ప్రదీప్ రావు, ఎట్టి జగదీష్, తాడ్వాయి మండల సర్పంచులు ప్రవళిక గున్ను, దిడ్డి మోహన్ రావు, జాజ విజయ చంద్రం, జిల్లా సీనియర్ నాయకులు రామసహాయం శ్రీనివాసరెడ్డి, పులుసు పురుషోత్తం, పులి నర్సయ్య, పిన్నింటి యాదిరెడ్డి, ఎండీ రఫీక్, ఇందిరారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ఓటరు నమోదు ఇన్చార్జులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

