నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
* నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం.
* తాగునీటి సరఫరాకు ఊరట
Raiparthy| ఆకేరు న్యూస్, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్నగర్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం దిశగా నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. గ్రామంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా బోర్ల మోటార్లు సక్రమంగా పనిచేసేందుకు అదనపు సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ను గ్రామ సర్పంచ్ పెండ్లి మహేందర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే చొరవతో..
గ్రామంలో విద్యుత్ వోల్టేజ్ సమస్య కారణంగా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సర్పంచ్ పెండ్లి మహేందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ట్రాన్స్ఫార్మర్తో వోల్టేజ్ సమస్య తగ్గి, బోర్ల మోటార్ల పనితీరు మెరుగుపడి తాగునీటి సరఫరా సజావుగా సాగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పలువురు పాల్గొనగా..
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చిన్నబోయిన రవి, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, గ్రామ పెద్ద మల్లేశం, ఇతర నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

