ములుగులో అంగన్ వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు
* 31 టీచర్, 104 హెల్పర్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ తేదీలను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. ఐసీడీఎస్ తాడ్వాయి, వెంకటాపురం ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 31 టీచర్, 104 హెల్పర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లు జిల్లా సంక్షేమ అధికారి ఈ.పీ. ప్రేమలత వెల్లడించారు.
ఇంటర్వ్యూల షెడ్యూల్ ఇదే..
ఇంటర్వ్యూలను నవంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
నవంబర్ 4: తాడ్వాయి ప్రాజెక్టు టీచర్ పోస్టులు
నవంబర్ 5: వెంకటాపురం ప్రాజెక్టు టీచర్ పోస్టులు
నవంబర్ 6: తాడ్వాయి ప్రాజెక్టు హెల్పర్ పోస్టులు
నవంబర్ 7: వెంకటాపురం ప్రాజెక్టు హెల్పర్ పోస్టులు
ఈ ఇంటర్వ్యూలు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ములుగు ఐడీఓసీలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు.
అర్హులైన అభ్యర్థులకే అవకాశం
సీడీపీఓ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనలో అర్హులుగా నిర్ధారణ అయిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు సూచించారు. అర్హుల జాబితాలను సంబంధిత మండల పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, సీడీపీఓ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ఇప్పటికే ప్రదర్శించినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను జాబితాలో పరిశీలించుకుని, నిర్ణీత తేదీల్లో అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

