నటుడు జేడీ చక్రవర్తి
* నిహారికపై జేడీ ప్రశంసలు
* డిసెంబర్ 11న రాకెట్స్
ఆకేరు న్యూస్, సినిమా: నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ పాకెట్ రాకెట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం ‘ది ఫస్ట్ హ్యాండ్’ పేరుతో సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
నిహారికపై జేడీ ప్రశంసలు
టీజర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో నిహారిక లాంటి గొప్ప నిర్మాతను చూడలేదు. పాకెట్ రాకెట్స్ సినిమా స్కేల్‌ను ఎంత గొప్పగా పెంచారో థియేటర్లోనే చూడాలి. అక్టోబర్‌లో షూటింగ్లో పాల్గొన్నాను. నవంబర్‌లో టీజర్, డిసెంబర్లో సినిమా విడుదల చేస్తున్నారు. దర్శకుడు రుద్ర అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు’’ అని ప్రశంసించారు.
ఆరు నెలల్లోనే సినిమా పూర్తి
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. జులైలో సినిమాను ప్రారంభించామని, దర్శకుడు రుద్ర అత్రితో తమకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసినట్లు చెప్పారు. టీజర్ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 11 వరకు సినిమా విశేషాలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
ఇద్దరు యువకుల జీవితాల చుట్టూ కథ
ఈ సినిమాలో ఇద్దరు యువకులు తమ జీవితాలను మార్చుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారనే అంశాన్ని చూపించినట్లు హీరో త్రినాథ్ వర్మ తెలిపారు. తాను అంజి అనే పాత్రలో కనిపిస్తానని, జీవితంలో ఎదగాలని, మంచి అవకాశం కోసం ఎదురుచూసే యువకుడిగా నటించినట్లు చెప్పారు. తనకు మరోసారి హీరోగా అవకాశం ఇచ్చిన నిహారిక, మన్యం రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
హీరో నిర్మల్‌కు ఇది తొలి సినిమా. తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిహారిక, దర్శకుడు రుద్రకు ధన్యవాదాలు తెలిపారు. హీరోయిన్ శ్రియా కొంతం మాట్లాడుతూ.. తాను హారిక పాత్రలో నటించానని, ప్రేక్షకులకు ఆ పాత్ర కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు.
ఫోన్ పక్కన పెట్టి సినిమా చూడొచ్చు
నిర్మాత రాహుల్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. డిజిటల్ కంటెంట్ రంగం నుంచి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టామని తెలిపారు. రుద్ర చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు చెప్పారు. ప్రేక్షకులు రెండు గంటల పాటు ఫోన్ పక్కన పెట్టి ఆస్వాదించేలా సినిమా ఉంటుందని అన్నారు.
దర్శకుడు రుద్ర అత్రి, సంగీత దర్శకుడు గ్యానీ, ఎడిటర్ అన్వర్ అలీ కూడా సినిమా విశేషాలను పంచుకున్నారు. చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు.
తారాగణం, సాంకేతిక బృందం
త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా కొంతం హీరోయిన్గా కనిపించనున్నారు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలుగా పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను ఎదురోలు రాజు, సంగీతాన్ని గ్యానీ, ఎడిటింగ్‌ను అన్వర్ అలీ నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రమేష్ మన్యం, ప్రొడక్షన్ డిజైనర్‌గా విష్ణు వర్ధన్ పుల్లా పనిచేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

