మాజీ జెడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి
Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి అన్నారు. బుధవారం తాడ్వాయి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దండుగుల మల్లయ్య ఆధ్వర్యంలో బయ్యక్కపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ ముడుపు నవీన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిట్టల సురేష్‌లకు నాగజ్యోతి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థ పాలనను భరించలేక, ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమం అందించగలిగేది బీఆర్ఎస్ పార్టీయేనని విశ్వసించి పలువురు నాయకులు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి గతంలో బీఆర్ఎస్ చేసిన కృషి, భవిష్యత్తులో పార్టీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే వారు పార్టీలో చేరారని తెలిపారు.
పార్టీలో నూతనంగా చేరిన నాయకులకు స్వాగతం పలుకుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, బయ్యక్కపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్లబోయిన ఐలయ్య, తాడ్వాయి మాజీ ఉపసర్పంచ్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, బంధాల మాజీ సర్పంచ్ ఊకే మోహన్ రావు, తాడ్వాయి యూత్ నాయకులు గంట మనోజ్ రెడ్డి, మనుగొండ నవీన్, వల్లెపు సారయ్య, పెండకట్ల కృష్ణ, నాలి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

