మంత్రి సీతక్క
* శిక్షణను సద్వినియోగం చేసుకోండి
* పట్టుదలతో చదవాలి
Minister Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్పిస్తున్న పోలీసు ఉద్యోగాల శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు.
బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యార్హతలు, శిక్షణ విధానం, వసతి సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. అభ్యర్థులు తమ లక్ష్యంపై దృష్టి సారించి, క్రమశిక్షణతో శిక్షణ పొందాలని సూచించారు. ఎక్కువ మంది ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు తదుపరి దశల్లోనూ ప్రతిభ కనబరిచి పోలీసు ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం శిక్షణార్థులతో కలిసి మంత్రి సీతక్క భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీఎస్పీ రవీందర్, ఆర్ఐ, సీఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

