మందకృష్ణ మాదిగ
* తెలంగాణ ప్రభుత్వానికి MRPS కృతజ్ఞతలు
* మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను సత్కరించిన మందకృష్ణ మాదిగ
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్లలో ఎస్సీ వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడంపై MRPS, MSP భీమదేవరపల్లి మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండల MRPS, MSP, అనుబంధ సంఘాల నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగుతున్న పోరాటానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలక ముందడుగని పేర్కొన్నారు. వర్గీకరణను ప్రకటనలకే పరిమితం చేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో అమలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం చొరవ చూపడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ నిర్ణయం వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే చారిత్రాత్మక పరిణామమని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు భీమదేవరపల్లి మండల MRPS, MSP, అనుబంధ సంఘాల తరఫున రుణపడి ఉంటామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో MRPS హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ, భీమదేవరపల్లి MRPS మండల అధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, MSP మండల అధ్యక్షుడు కాదాసు ప్రవీణ్, MRPS సీనియర్ నాయకులు మాడ్గుల ప్రభుదాస్, పార్ణందుల సురేష్, బొల్లంపల్లి జోసఫ్, MRPS మండల అధికార ప్రతినిధి మాడ్గుల ప్రణయ్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

