Parkal MLA Collector Review
* ప్రభుత్వ భూములపై ప్రత్యేక నిఘా
* రెవెన్యూ దరఖాస్తులు పెండింగ్‌లో వద్దు
* క్షేత్రస్థాయి విచారణలు వేగవంతం
ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి (MLA Revuri Prakash Reddy), జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తునూ పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో వివిధ అంశాలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. భూ రీ సర్వే ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రెవెన్యూకు సంబంధించిన ప్రతి దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని, విచారణకు సంబంధించిన వివరాలను దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం పరకాల ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల తీరును ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

