Telangana IPS Transfers 2026
* 21 మందికి కొత్త పోస్టింగ్‌లు
* హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్..
* ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ విభాగానికి వీసీ సజ్జనార్ బదిలీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నవంబర్ 12, 2026న జీఓ ఆర్టీ నంబర్ 1654 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ బదిలీల్లో ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
డాక్టర్ సౌమ్య మిశ్రాను డీజీపీ, ఉమెన్ అండ్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా విభాగాల బాధ్యతల నుంచి బదిలీ చేసి డీజీపీ, పోలీస్ ఆర్గనైజేషన్‌తో పాటు డీజీపీ, పోలీస్ లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వాతి లక్రాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్ బాధ్యతల నుంచి బదిలీ చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్‌గా నియమించారు.
చారు సిన్హాకు డీజీపీ, సీఐడీ బాధ్యతలతో పాటు ఉమెన్ అండ్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ అనిల్ కుమార్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల బాధ్యతల నుంచి బదిలీ చేసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
యాదగిరి నాయుడు రెడ్డికి సివిల్ సప్లైస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయనకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ బాధ్యతలు కూడా అప్పగించారు.
మరోవైపు ఎం. స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్‌గా నియమించారు. విక్రమ్ సింగ్ మన్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు.
కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు పొందిన అధికారులు:
1. డాక్టర్ సౌమ్య మిశ్రా – డీజీపీ, పోలీస్ ఆర్గనైజేషన్.
2. స్వాతి లక్రా – డీజీ, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్.
3. మహేశ్ మురళీధర్ భగవత్ – హైదరాబాద్ పోలీస్ కమిషనర్.
4. చారు సిన్హా – డీజీపీ, సీఐడీ.
5. డాక్టర్ అనిల్ కుమార్ – టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ.
6. వీసీ సజ్జనార్ – డీజీ, ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్.
7. యాదగిరి నాయుడు రెడ్డి – కమిషనర్, సివిల్ సప్లైస్.
8. సంజయ్ కుమార్ జైన్ – అదనపు డీజీ, ట్రైనింగ్.
9. విక్రమ్ సింగ్ మన్ – డీజీపీ, ఆపరేషన్స్.
10. ఎం. స్టీఫెన్ రవీంద్ర – డైరెక్టర్, TG-TMARS.
11. ఆకున్ సబర్వాల్ – అదనపు డీజీ, లా అండ్ ఆర్డర్.
12. ఎస్. చంద్రశేఖర్ రెడ్డి – డైరెక్టర్, ఏసీబీ.
13. కార్తికేయ – ఐజీ, మల్టీ జోన్-1.
14. కె. రమేష్ నాయుడు – ఐజీ, రైల్వేస్.
15. డి. జోయల్ డేవిస్ – జాయింట్ డైరెక్టర్, రోడ్ సేఫ్టీ.
16. జి. చందన దీప్తి – జాయింట్ కమిషనర్, ఫ్యూచర్ సిటీ.
17. ఆర్. భాస్కరన్ – డీఐజీ, ఇంటెలిజెన్స్.
18. కె. నారాయణ నాయక్ – డీఐజీ, జోన్-2 బాసర అదనపు బాధ్యతలు.
19. ఎల్.ఎస్. చౌహాన్ – డీఐజీ, కోఆర్డినేషన్.
20. శ్రీ బాలాదేవి – డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), TG-TMARS.
21. వి. అరవింద బాబు – డీసీపీ, SM&IT, హైదరాబాద్.
రాష్ట్ర పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాలకు కొత్త అధికారులను నియమించడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజా బదిలీలు తెలంగాణ పోలీస్ శాఖలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

