బాధితుడు శ్రీనివాసు
* లష్కర్ ఉద్యోగం పేరుతో రూ.50 వేలు వసూలు..!
ఆకేరు న్యూస్, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన హాలవత్ శ్రీనివాసుకు నీటిపారుదల శాఖలో ‘లష్కర్’ ఉద్యోగం ఇప్పిస్తామని (Palakurthi Job Fraud) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్య నాయక్, ఏకే తండా సర్పంచ్ హలావత్ సోమ్లా నమ్మబలికారు.
ఇందుకోసం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేరుతో కూడిన లెటర్ ప్యాడ్‌పై శ్రీనివాసును లష్కర్ పోస్టుకు నియమించినట్లుగా పత్రాన్ని, ఎమ్మెల్యే సంతకంతో కూడిన లెటర్ ప్యాడ్ ను (Palakurthi Job Fraud) బాధితుడికి అందజేశారు.
* రెండేళ్లయినా రాని ఉద్యోగం..
ఇది నిజమని నమ్మిన శ్రీనివాసు రెండు దఫాలుగా ఆన్లైన్ ద్వారా రూ. 20 వేలు, మిగతా రూ. 30 వేలను నగదు రూపంలో వారికి ముట్టజెప్పాడు. అయితే రెండేళ్లు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు సదరు నాయకులను నిలదీశాడు.
దీనిపై వారు కనీసం బాధ్యత వహించకపోగా, “ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్‌కి, నువ్వు ఇచ్చిన డబ్బులు ఎప్పుడో అయిపోయాయి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి బెదిరింపులకు దిగారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హాలవత్ శ్రీనివాస్త నకు న్యాయం చేయాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను ప్రజావాణిలో ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వెలిబుచ్చాడు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

