పట్టభద్రుల ఓటర్లు (ఫైల్ ఫోటో)
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Telangana Graduate MLC Elections) నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియకు భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు దరఖాస్తుల (Graduate Voter Registration) సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021లో నమోదైన దరఖాస్తులతో పోలిస్తే ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో 1,07,125 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. మొత్తంగా 19.02 శాతం పెరుగుదల నమోదైంది. జిల్లాలవారీగా పరిశీలిస్తే వరంగల్ జిల్లాలో అత్యధికంగా 70.49 శాతం వృద్ధి కనిపించడం విశేషం.
* వరంగల్‌లో అత్యధిక పెరుగుదల..
వరంగల్ జిల్లాలో 2021లో 39,334 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 67,062కు చేరింది. అంటే 27,728 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. గతంతో పోలిస్తే 70.49 శాతం పెరుగుదల (Warangal Voter Registration) నమోదైంది. ఈ నియోజకవర్గ పరిధిలోని జిల్లాల్లో ఇదే అత్యధిక వృద్ధి. సిద్దిపేట జిల్లాలో 4,608 నుంచి 7,340కు దరఖాస్తులు పెరిగాయి. 2,732 అదనపు దరఖాస్తులతో 59.29 శాతం వృద్ధి నమోదైంది. జనగామలో 24,840 నుంచి 35,424కు చేరగా, 42.61 శాతం పెరుగుదల కనిపించింది. మహబూబాబాద్‌లో 39,273 నుంచి 53,778కు పెరిగి 36.93 శాతం వృద్ధి నమోదైంది.
* ఖమ్మం, నల్లగొండలోనూ పెరుగుదల..
ఖమ్మం జిల్లాలో 2021లో 96,958 దరఖాస్తులు ఉండగా, ప్రస్తుతం 1,09,979కు చేరాయి. 13,021 దరఖాస్తుల పెరుగుదలతో 13.43 శాతం వృద్ధి నమోదైంది. నల్లగొండ జిల్లాలో 1,00,443 నుంచి 1,14,456కు దరఖాస్తులు పెరిగాయి. ఇక్కడ 14,013 అదనపు దరఖాస్తులు వచ్చాయి. పెరుగుదల శాతం 13.95గా ఉంది. సూర్యాపేటలో 67,971 నుంచి 74,027కు దరఖాస్తులు చేరి 8.91 శాతం పెరిగాయి. యాదాద్రి భువనగిరిలో 42,957 నుంచి 49,857కు పెరిగి 16.06 శాతం వృద్ధి నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 47,388 నుంచి 57,356కు చేరడంతో 21.03 శాతం పెరుగుదల (Khammam Nalgonda Graduate Voters) కనిపించింది.
* హనుమకొండలో తగ్గిన దరఖాస్తులు..
మిగిలిన జిల్లాల్లో ఎక్కువగా పెరుగుదల కనిపించినప్పటికీ హనుమకొండలో మాత్రం దరఖాస్తుల సంఖ్య తగ్గింది. 2021లో 73,734 దరఖాస్తులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 67,865కు పరిమితమైంది. 5,869 దరఖాస్తులు తగ్గడంతో 7.96 శాతం క్షీణత (Hanumakonda Voter Registration) నమోదైంది. ములుగు జిల్లాలో 11,664 నుంచి 15,355కు దరఖాస్తులు పెరిగాయి. ఇక్కడ 31.64 శాతం వృద్ధి కనిపించింది.
* మొత్తంగా 19 శాతం వృద్ధి..
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన గణాంకాల ప్రకారం 2021లో మొత్తం 5,63,282 దరఖాస్తులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 6,70,407కు చేరింది. అంటే 1,07,125 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. మొత్తం పెరుగుదల 19.02 శాతంగా నమోదైంది (Graduate MLC Voter Data).
జిల్లాలవారీగా నమోదైన ఈ గణాంకాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో కనిపిస్తున్న పెరుగుదల చర్చనీయాంశంగా మారింది. అయితే ఓటరు నమోదు పెరిగినంత మాత్రాన ఎన్నికల ఫలితం ఏ వైపు ఉంటుందో ముందే చెప్పలేం. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యలు, అభ్యర్థుల ప్రచారం, స్థానిక అంశాలు ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

